![]() |
మెరుగైన స్త్రీ సమాజం కోసం మీడియా కృషి చేయగలదు |
నిర్భయ మృతి = నిర్భయ చట్టం=నివాళి
ఇది మీడియా మాత్రమే చేయగలదు. ప్రతి వ్యక్తి ఒకటి రెండు రోజులు బాధపడో పోరాడో వదిలివేస్తారు.కానీ మీడియా అనుకుంటే అది నెరవేరే వరకు కృషి చేస్తుంది.గతం గతః అని నిర్భయ చావు ని మరచిపోకండి.
నిర్భయ చావుతో అయినా స్త్రీ గౌరవం పురుడు పోసుకోనివ్వండి.
మాములు విషయాలలా వదలకండి. ఇది ఆఖరి అత్యాచార మరణం కావాలి.
పవిత్ర భారతదేశం లో ఈ కీచకపర్వం ఆగాలి.
నిర్భయ లాంటి అభాగ్యులు ఇక ఉండకూడదు.
సమాజం సిగ్గు పడే విధంగా ఉన్న ప్రస్థుత పరిస్థితి ఇంతటితో ముగియాలి
ప్రతి తల్లి తండ్రి
ప్రతి టీచర్
ప్రతి సంఘసంస్కర్త
ప్రతి మీడియా
ప్రతి పేపర్
ప్రతి ఇల్లు
ప్రతి స్టూడెంట్
ఆడదాని గౌరవం పెంచటానికి కృషి చేయాలి. భావి తరాలకు మంచి సంస్కృతి సాంప్రదాయాలను అందివ్వాలి. పిల్లలకు చిన్నతనం నుంచి విలువలు నేర్పాలి. భారతదేశం పవిత్రమై నది అని రుజువు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాటి నీచ చరిత్ర పునరావృతం కాకుండా గట్టి చట్టం రావాలి. నిర్భయ మృతితో పురుడు పోసుకున్న నిర్భయ చట్టం అమలు జరిగేలా మీడియా బలంగా కృషి చేయాలి.
- ఇది స్త్రీ విన్నపం
No comments:
Post a Comment