Saturday, December 29, 2012

HELPLINE

we want FAST TRACK HELPLINE for ladies for immediate help

Vote for NIRBHAYA act 2013

సమాజం లో ప్రతి ఒక్కరి ఆలోచనలు మారాలి.నాటి సర్పయాగం నుంచి నేటి నిర్భయ వరకు ఇలాటి ఎన్నో  వేడుకలు  చూస్తున్నాం. పోరాడుతున్నాం. మర్చిపోతున్నాం. కళ్ళ ముందు నేరస్తులు ఉన్నా శిక్ష వేయలేని దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి సమాజం లో బ్రతుకుతున్నాము.  ఇలాంటివి రొజూ ఏదో మూల ఎవరో ఒకరు ఇలా బలి అవుతూనే ఉన్నారు.  దీనికి కారణం స్త్రీలకు సరైన చట్టాలు మరియు న్యాయాలు లేవు. ఒక్క సారి కాని అత్యాచారం చేసిన వెధవలకు శిక్ష వెంటనే అమలు జరపాలి.(ఆ శిక్ష ఆ చట్టం పేరు వింటేనే  పుట్టాలి). స్త్రీల కోసం  ప్రత్యేక పోలీస్ టీం  ఉండాలి . నేరస్తులు తెలిసినా కూడా దర్యాప్తులు వాయిదాలు అని జాగారం చేస్తున్నారు. ఇలా కాదు స్త్రీలకు న్యాయం కావాలి. క్షణ కాల సుఖం కోసం అమ్మాయి ని వయసు వావి  వరస అన్నీ మరచి ఒక మృగం లా మారి వేధిస్తుంటే పాపం అని కుడా జాలి పడని ఆ కర్కశ రాక్షస హృదయాలను కన్నది కుడా ఓ అమ్మే కదా.  

MEDIA'S EFFORT


మెరుగైన స్త్రీ సమాజం  కోసం మీడియా  కృషి చేయగలదు 
నిర్భయ మృతి = నిర్భయ చట్టం=నివాళి
ఇది మీడియా మాత్రమే చేయగలదు. ప్రతి వ్యక్తి ఒకటి రెండు రోజులు బాధపడో పోరాడో వదిలివేస్తారు.కానీ మీడియా అనుకుంటే  అది నెరవేరే వరకు  కృషి చేస్తుంది.
గతం గతః అని నిర్భయ చావు ని మరచిపోకండి.
నిర్భయ చావుతో అయినా స్త్రీ గౌరవం పురుడు పోసుకోనివ్వండి.
మాములు  విషయాలలా వదలకండి.  ఇది ఆఖరి అత్యాచార మరణం కావాలి.
పవిత్ర భారతదేశం లో ఈ కీచకపర్వం ఆగాలి.
నిర్భయ లాంటి అభాగ్యులు ఇక ఉండకూడదు.
సమాజం సిగ్గు పడే విధంగా  ఉన్న ప్రస్థుత పరిస్థితి ఇంతటితో ముగియాలి
ప్రతి తల్లి తండ్రి
 ప్రతి టీచర్
ప్రతి సంఘసంస్కర్త
ప్రతి మీడియా
ప్రతి పేపర్
ప్రతి ఇల్లు
ప్రతి స్టూడెంట్
ఆడదాని గౌరవం పెంచటానికి కృషి చేయాలి. భావి తరాలకు  మంచి సంస్కృతి సాంప్రదాయాలను అందివ్వాలి. పిల్లలకు  చిన్నతనం నుంచి  విలువలు నేర్పాలి. భారతదేశం పవిత్రమై నది అని రుజువు చేసుకోవాల్సిన  సమయం ఆసన్నమైంది. ఇలాటి నీచ చరిత్ర పునరావృతం కాకుండా  గట్టి చట్టం రావాలి. నిర్భయ మృతితో పురుడు పోసుకున్న నిర్భయ చట్టం అమలు జరిగేలా మీడియా బలంగా కృషి  చేయాలి.
- ఇది స్త్రీ విన్నపం

FIGHT FOR NIRBHAYA ACT 2013



 FIGHT FOR NIRBHAYA ACT-2013

నిర్భయ జీవితం  1989-2012 నిశీధిలోకి నిర్జీవమైన జీవితం.
నిర్భయ పేరుతో చట్టం కావాలి. 
నిజమైన స్త్రీ స్వేచ్చ కావాలి.
 నిర్భయంగా  జీవించాలి.
   నిర్భయకు  ఇదే మా నివాళి.
                    నాకు ఇంకా జీవించాలని ఉంది.                                                                   -నిర్భయ.


 

NIRBHAYA

నిర్భయ మరణం  తో ఊపిరి పోసుకోవాల్సిన 
నిర్భయ చట్టం
అత్యాచారం చేసిన వారికి వారి కుటుంబ సభ్యులు స్నేహితులు  మరియు సంఘం  మధ్య భయంకరమైన ఉరి 
సంఘం లో ప్రతి స్త్రీ నిర్భయంగా జీవించటం కోసం  నిర్భయ  మరణంతో ఐనా నిర్భయచట్టం కావాలి.
ఈ నిర్భయ తో ప్రతి  వెధవ పరాయి  ఆడదాన్ని ముట్టుకోవటానికి  కూడా భయపడాలి. 
ఇక భవిష్యత్  లో  ఇంకొక స్త్రీకి ఇలా జరగకూడదు . భారతదేశం అనగా స్త్రీలను పూజించే దేశం. అలాటి గొప్ప దేశంలో  ఇలాటి చట్టం ఒకటి తావాలి అని అడగాల్సిన దుస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా నిర్భయ పోలీస్ టీం లను ఏర్పాటు చేయాలి. ప్రజలు, యువత ,మహిళా అధికారులు మరియు మహిళా సంఘాలు ఈ చట్టం కోసం కృషి చేయాలి. మహిళా  రాష్ట్రపతి గా షీలా దీక్షిత్ మరియు యు.పి.ఎ .పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధి ఈ చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజం లో చైతన్యం  తేవాలి. స్కూల్స్ మరియు కాలేజీల్లో నిర్భాయచట్టం గురించి అవగాహన చేయాలి. స్త్రీ లేని సమాజం దుర్భరం గా ఉంటుంది. ప్రతి ఇంటి లో ప్రతి ఒక్కరు ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. 
ప్రతి policestation లో ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో ఈ చట్టం గురించి బోర్డు పెట్టాలి 
1) మహిళలను  గౌరవించాలి 
2) మహిళలను తూలనాడరాదు .
3) మహిళలను సమానంగా ఎదగనివ్వాలి.
4) మహిళలకు స్వాతంత్రపోరాట హక్కు కల్పించాలి.
5) మహిళల కేసులు వెంటనే పరిష్కరించటానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలి. 
6) మహిళలపై అత్యాచారం నేరం 
7)మహిళల ను బాధపెట్టిన వారికి వెంటనే శిక్షలు అమలు జరపాలి