Saturday, December 29, 2012

NIRBHAYA

నిర్భయ మరణం  తో ఊపిరి పోసుకోవాల్సిన 
నిర్భయ చట్టం
అత్యాచారం చేసిన వారికి వారి కుటుంబ సభ్యులు స్నేహితులు  మరియు సంఘం  మధ్య భయంకరమైన ఉరి 
సంఘం లో ప్రతి స్త్రీ నిర్భయంగా జీవించటం కోసం  నిర్భయ  మరణంతో ఐనా నిర్భయచట్టం కావాలి.
ఈ నిర్భయ తో ప్రతి  వెధవ పరాయి  ఆడదాన్ని ముట్టుకోవటానికి  కూడా భయపడాలి. 
ఇక భవిష్యత్  లో  ఇంకొక స్త్రీకి ఇలా జరగకూడదు . భారతదేశం అనగా స్త్రీలను పూజించే దేశం. అలాటి గొప్ప దేశంలో  ఇలాటి చట్టం ఒకటి తావాలి అని అడగాల్సిన దుస్థితి వచ్చింది. దేశ వ్యాప్తంగా నిర్భయ పోలీస్ టీం లను ఏర్పాటు చేయాలి. ప్రజలు, యువత ,మహిళా అధికారులు మరియు మహిళా సంఘాలు ఈ చట్టం కోసం కృషి చేయాలి. మహిళా  రాష్ట్రపతి గా షీలా దీక్షిత్ మరియు యు.పి.ఎ .పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధి ఈ చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజం లో చైతన్యం  తేవాలి. స్కూల్స్ మరియు కాలేజీల్లో నిర్భాయచట్టం గురించి అవగాహన చేయాలి. స్త్రీ లేని సమాజం దుర్భరం గా ఉంటుంది. ప్రతి ఇంటి లో ప్రతి ఒక్కరు ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. 
ప్రతి policestation లో ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో ఈ చట్టం గురించి బోర్డు పెట్టాలి 
1) మహిళలను  గౌరవించాలి 
2) మహిళలను తూలనాడరాదు .
3) మహిళలను సమానంగా ఎదగనివ్వాలి.
4) మహిళలకు స్వాతంత్రపోరాట హక్కు కల్పించాలి.
5) మహిళల కేసులు వెంటనే పరిష్కరించటానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలి. 
6) మహిళలపై అత్యాచారం నేరం 
7)మహిళల ను బాధపెట్టిన వారికి వెంటనే శిక్షలు అమలు జరపాలి 
 

No comments: